నిజాం రజాకార్లు పాయే
ఖద్దరు ఖాకీలు అచ్చే
హుకుం జులుం పాయే
దాష్టీకం దౌర్జన్యం అచ్చే
దుష్పరిపాలన పాయే
దుర్మార్గపు పరిపాలన అచ్చే
అప్పటి ప్రజలు అన్యాయం కింద సచ్చే
ఇప్పటి ప్రజలు ఆధునిక బానిసత్వం కింద బ్రతుకు ఈడ్చే
స్వయంపరిపాలన అచ్చినా సుపరిపాలన ఇంకా రాలే అని
ఈ ఆధునిక తెలుంగువాఁడు దినం దినం మూగబోయి ఏడ్చే
***
రాజులు రాజ్యాలు పాయే,
మంత్రులు మండలాలు అచ్చే
రాజరిక వారసులు పాయే,
వారసత్వ రాజకీయం అచ్చే
శాసనాలు చాటింపులు పాయే,
జీ.ఓ.లు ఆర్డర్లు అచ్చే
దురాగతాల పాలన పాయే,
నేరపూరిత పరిపాలన అచ్చే
అప్పటి జనాలు మూర్ఖత్వం కింద సచ్చే,
ఇప్పటి జనాలు కుతంత్ర తంత్రాల కింద బ్రతుకు ఈడ్చే
ప్రజా పాలన అచ్చినా సుభిక్ష పాలన ఇంకా రాలే అని
ఈ భారతీయుడు క్షణం క్షణం ఆర్ద్ర పూరిత రౌద్రంతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచే
****
No comments:
Post a Comment