Monday, June 23, 2025

కడలి నెల ప్రేమ కథ


మాపు వెన్నెల తళుకు మిణుకు

కడలి అలల ఒయల హొయలు

మిరుమిట్లు గొలిపే 

       ఈ కాలచక్రముని వినుడు


కడలి ఉవ్వెత్తున ఎగిసెను

ఆ నెలరాజుని చేరాలని,

అల పట్టుకు లాగే ఆ వెలిరాజు

కడలిని కౌగిట్లో బంధించాలని


అమవాస నాడు రేరాజు లేని రోజు 

సాగరి మదిన హోరు కనుల కన్నీరు 

కడలి కన్నీరుకి లవణమయమాయె 

                         జలధి మున్నీరు


ప్రతి పది అయిదు దినములు

నిశికేశి నెచ్చెలితో దోబూచులాడగా,

ప్రతి రోజు దొర రాజు 

    చిరు-చిరు మోము చూపించగా

కసు బుసు లాడె కడలి 

    కొపముంతా ధరుడిపై చూపగా


నిండునాడు పున్నమి కాంతుల సరిగమలలొ

సమద్రి ఉగ్రరూపము దాల్చి విరహ నాట్యములాడగా

సమస్త జీవరాశులు మైముగ్ధులై

      కనురెప్పార్పక కనువిందుల చిందులు చూడరా


అనాదిగా సాగు ఈ విరహ వేదన కేలిక

ఏనాడు సుఖించునో కడలి నెల ప్రేమ కథ

ఆనాడే ముగియును 

              సమస్త భూమండల మనుగడ


***

కడలి=sea

నెల=moon

వెలి=white

లవణమ=salt

రే=night




Friday, June 20, 2025

డబ్బు

పుడితే డబ్బు పోతే డబ్బు  
ధూళి డబ్బు గాలి డబ్బు
నేల డబ్బు నీళ్లు డబ్బు
ప్రేమ డబ్బు పెళ్లి డబ్బు
పేగు డబ్బు పాడే డబ్బు
జబ్బు డబ్బు మందు డబ్బు
డబ్బు డబ్బు డబ్బే డబ్బు 

గుండె చప్పుడు లబ్బు-డబ్బు
మనిషి నడత టప్పు-డబ్బు
డబ్బు కోసం గిబ్బు-గిబ్బు
బ్రతుకు మొత్తం కబ్బి-గబ్బు 

లేనే లేదు తప్పు-ఒప్పు 
కానే కాదు తెలుపు-నలుపు
ఉంది ఒక్కటే లిబ్బి-డబ్బు 
సలాము కొట్టు కాసు-దుడ్డు

ఉన్నవాడు లేనివాడు 
కిందవాడు పైనవాడు
మధ్యవాడు మిథ్యవాడు
ఎవ్వడైనా ఎప్పుడైనా ఎక్కడైనా 
డబ్బు ముందు మోకరిల్లుతాడు
డబ్బు డబ్బు డబ్బే డబ్బు

                                                           

గిబ్బు: fight, kill
కబ్బి: cheat, మోసము
లిబ్బి డబ్బు కాసు దుడ్డు: money
మిథ్య : deceptive, unreal
మోకరిల్లు : kneel down
https://andhrabharati.com/dictionary/index.php


Thursday, June 19, 2025

SriSri siprali

 When we think of Sri Sri — Srirangam Srinivasa Rao — we often think of his fiery, revolutionary poetry. Verses like:

"స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి, రగిలించి రక్తాలు ...."

"... ఇలాతలంలో హేమం పిండగ- జగానికంతా సౌఖ్యం నిండగ…"

"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను..."

These are some of his powerful lines that shook up the telugu world and inspired generations. But there's a side to Sri Sri — a side full of wit, satire, and humor. That side comes through beautifully in a book called Siprali, a collection of his more playful poems.

What’s interesting is that Sri Sri, who was known for ditching traditional poetic forms early on in favor of free verse, actually returned to classic meters later in his career — especially in poems of Siri Sirimuva, written in the Kanda meter. By the way, Siprali isn’t just a random title — it’s a blend of three sections:

si: సిరిసిరిమువ్వ పద్యాలు

pra: ప్రాస క్రీడలు

li: లిమరుక్కులు

While much of Siprali still carries his signature political and social satire, there are quite a few gems that are just plain humorous. And those are the ones I want to share here.

కుర్చీలు విరిగిపోతే

కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్

కూర్చే శక్తి నశిస్తే

చేర్చదగు నొకింత చెత్త సిరిసిరిమువ్వా!

***

మళ్లీ ఇన్నాళ్లకు ఇ

న్నేళ్లకు పద్యాలు రాయుటిది

యెట్లన్నన్ పళ్ళూడిన ముసిలిది కు

చ్చిళ్లన్ సవరించినట్లు సిరిసిరిమువ్వా!

***

మీసాలకి రంగేదో

వేసేస్తే యౌవనం లభించదు నిజమే!

సీసా లేబిల్ మార్చే

స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరిమువ్వా!

***

ఉగ్గేల త్రాగుబోతుకు?

ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?

విగ్గేల కృష్ణశాస్త్రికి?

సిగ్గేలా భావకవికి? సిరిసిరిమువ్వా!

***

పెద్దబాలశిక్ష చదివీ

చదవడమే తడవుగాగ సాహిత్య విశా

రదులయినట్లుగా భావిం

చెదరు గదా కొంతమంది సిరిసిరిమువ్వ!

***

అరిచే కుక్కలు కరవవు

కరిచే కుక్కలు మొరగవు

కరవక మొరిగే కుక్కలు తరమవు

అరవక కరిచే కుక్కలు మరలవు

అరవని కరవని కుక్కలు ఎక్కడా దొరకవు

***

అతగాడి పేరు గురాచారి

అతనో పెద్ద దురాచారి

అతనిది దెప్పుడు మరో దారి

అతనికంటే భార్య కొద్దిగా అనాకారి

అతనిపాలిటి కావిడ మహమ్మారి

***

తెలుగువాడి తెలివి తేటలకి జై జై

తెలుగు వాడు దేనికైనా సై సై

తెలుగువారిని ఎదురువాడు నై నై

తెలుగునాట కవులపాట హై - ఫ్య్

ప్రస్తుతానికి వస్తా మరి నేస్తం బై బై

****

Wednesday, June 4, 2025

ఏడి శివం

 ఏ...డి... శివం 

నూ... నే... శివం 


జీ.వం... తపం

ప్రే.మే.... శివం 


నమ్మేవాడికి పలికే శివమే ప్రేమగ వెలుగవునూ....

నమ్మనివాడికి చూపే ప్రేమే శివముగ వెలుగవునూ....


ప్రేమే శివం సేవే శివం నిత్యం

ప్రేమే శివం సేవే శివం సర్వం

ప్రేమే శివం సేవే శివం నిత్యం

ప్రేమే శివం సేవే శివం సర్వం


ఏ....డి.... శివం 

నూ...నే... శివం 


ప్రా.ణం.. ఇహం

ప్రే.మే... శివం


విషమును కక్కే దేహం ఉంటే లోకం శోకమురా....

సాయము చేసే మనసే ఉంటే లోకం సౌఖ్యమురా...


ప్రేమే శివం సేవే శివం నిత్యం

ప్రేమే శివం సేవే శివం సర్వం

ప్రేమే శివం సేవే శివం నిత్యం

ప్రేమే శివం సేవే శివం సర్వం


ఏ....ఏ.... శివం 

నీ...నా... శివం 


ఆ.త్మే... నిజం 

సే.వే... శివం


కంచలు కట్టే మాటలకెప్పుడు తావే లేదు కదా ....

మంచిని పంచే దారులకెప్పుడు అంతం లేదు కదా..


ప్రేమే శివం సేవే శివం నిత్యం

ప్రేమే శివం సేవే శివం సర్వం

ప్రేమే శివం సేవే శివం నిత్యం

ప్రేమే శివం సేవే శివం సర్వం


ఏ...డి... శివం 

నూ... నే... శివం 


జీ.వం... తపం

ప్రే.మే.... శివం 





Original song was written by vairamuthu for tamil movie anbe sivam.

For telugu dub, vennelakanti had written the lyrics.

I wanted to write my own version of the song after watching the movie and this is it.





నమ్మేవాడికి శివమే నిజమంటా

నమ్మనివాడికి నిజమే శివమంటా