Tuesday, April 29, 2025

కూలిగాడు

    కూలిగాడు వాడు  

    బానిసగాడు కాదు


    కొలువు చేసేటోడు వాడు 

    నిన్ను కొలిచెటోడు కాదు


    లేనివాడు ఏమో వాడు 

    అదటులేమి ఉన్నవాడు కాదు 


    కూలితనములో గొప్పతనము 

    నీతి పలుకుల పొత్తము,

    నీటి బుడగలు మొత్తము

    తూట్లు పొడవగ రిక్తము


  

    ***

    అదటులేమి: lack of respect

    కూలితనములో గొప్పతనము: dignity of labour

Thursday, April 24, 2025

వలపు వ్రాలు

మనసులో మబ్బులు కమ్మయ్యేగా

రజని యే ఆ రవి ని దాచేయ్యగా 


చల్లని మాపులో

ఏకాంత వేళలో

వాంఛల పొంచులో


కించిత్ కషితో

కంచిత్ కృషితో

సంచిత ఆశలతో


కాళిదాసుకే ఈర్ష్య పుట్టగా

కృష్ణశాస్త్రికే మతులు చెడగా

ఆ కాంతా దాసుడే ప్రేమ కవితా పత్రం రాయగా


     "స్వయంప్రకాశీత రూపమా అమావాస్య దీపమా

      సౌందర్యవనమా ప్రేమోన్మాదక మరణ శాసనమా

      స్వప్నలోక విహంగమా గుండెలకు చేయు గాయమా

      నిర్భావ వరదాయిని నీకు నా నమస్సులు"


అని ఆ జాబిలికి జాబు రాయగా

జవాబుగా మౌనమా మౌనంగీకారమా

చీత్కారమా, ఫట్కారమా లేక అంగీకారమా 


ఓ బాలగోపాల వ్రాసావులే వినసొంపు జోల

ధన్యవాదాలు, నీ చలువ నే రాస్తి రోత రోల

సుఖమయమవ్వాలిలే నీ ప్రేమ గోల


                                                     ***

Thursday, April 17, 2025

ధర్మ నీతి

అమ్మ బొడ్డు కోసింది మొదలు

భూతల్లి ఒడిన బూడిదై కాలే వరకూ

అవినీతి రీతియే నా వేద భారతావని ధర్మ నీతి


పదవుల్లో ఉండే దొరలు మొదలు

కొలువుల్లో ఉండే ప్రజలు వరకు

ఆఖరికి ఆ ఏడుకొండల సామి ముడుపు కొరకు

ఇచ్చి పుచ్చుకోవడమే

  ఈ వికర్మ-భూమి నేటి అలనాటి ఆనవాయితీ


పన్నుల భారం ముళ్ళ శిరోధార్యం 

        కాని విద్య-వైద్యం చిల్లర బేరం

అయినా ఓటే వెయ్యని గాడిదలకు 

       కలుషిత సామ్రాజ్యమే సరైన రాజ్యం

ఉచితాలకు రుచి మరిగిన జనం

       పురోగతి అధోగతిపాలయితే వారికేం

అయినా ఓటు అమ్మిన కుక్కలకు 

        నక్కల సామ్రాజ్యమే సరైన రాజ్యం


ముష్కర మూకలు కక్కేరు విష విద్వేషములు

కాని జనుల భవితకై కదం తొక్కరే! నోరు మెదపరే!

ఓటుని అమ్ముకోవద్దని హితోపదేశం చేయరే

లంజ్చం హీనమని గొంతేత్తి గీతోపదేశం చేయరే

అయినా అధర్మార్జన చేసే పందులకు 

       విషపూరిత సామ్రాజ్యమే సరైన రాజ్యం


అనాటి కవుల నుంచి ఈనాటి నా బోటి వారి వరకు

ఎవరెన్ని రాసినా ఎవరెన్ని కూసినా ఏమి లాభం

అధర్మ పథమే పరమ పథముగా పరుగిడు జనం

కాల-ధర్మమే ఇక నిర్ణయించును భారతపు పథగమనం

Friday, April 11, 2025

నీలి చుక్క(Earth)


పాలపుంతలో 

చక్కని 

నీలి చుక్క


కణకణ కణికకు

కనకపు తీరములో


మంచు టోపీ

పెట్టుకొని


హిమ మేజోళ్ళు

వేసుకొని


నీళ్ల దుప్పటి

కప్పుకొని


మట్టి దిబ్బలు

అద్దుకొని


ఆ దిబ్బలపై 

ఆకుపచ్చని రంగు  

పూసుకొని


గాలి బుడగలో

ఇముడుకొని


పొత్తిన జీవులు

దాచుకొని


మనుషులు 

పెట్టే బాధలు

ఓర్చుకొని


రివ్వున తిరుగు

ఎంచక్కా


                                                 ***

కణకణ కణికకు కనకపు తీరములో

Near sun's (goldilocks) habitable zone.




ఈ ప్రొద్దు "పొద్దు"కి అంకితం

 ఈ ప్రొద్దు "పొద్దు"కి అంకితం / Today is dedicated to 'పొద్దు'.


ప్రొద్దు/పొద్దు - it has two meanings: "దినము/పూట/day" ; "సుర్యుడు/రవి/sun".

The word "పొద్దు" (poddu) likely originated with the meaning "sun" and later evolved in common usage to mean "day."

In early/old days, people thought that "ప్రొద్దు" is vikruthi of sanskrit word "బ్రధ్న/sun" but it has been established as Dravidian word by linguists. 

cognates of ప్రొద్దు/proddu: పొళ్షదు(tamil), పొత్తు/పొర్తు(kannada)


ఒక పొద్దు(ఒక పూట): once a day

ఇరు పొద్దు(రెండు పూటలా): twice a day

ముప్పొద్దు(ముడు పూటలా): thrice a day

అప్పుడు: ఆ + పొద్దు, at that time

ఇప్పుడు: ఈ + పొద్దు, Now

ఎప్పుడు: ఏ + పొద్దు, when

ఎల్లపుడు, ఎల్ల-పొద్దు: ఎల్లన్‌ + అపుడు; all-day; always


ఓరంతపొద్దు: ఓర+అంత+ప్రొద్దు; ఒక రోజంతా; all-day; always

పొద్దుగూకులు: all-day; always

రవంత-పొద్దు,ఇసువంత-పొద్దు: small/little time

కొండొక పొద్దు: small/little time

రొద్దు: small/little time

కూటి పొద్దు: భోజన వేళ; Time to eat.

యేడొద్దులు, ఏడొద్దులు(ఏడు పొద్దులు): seven days

పొద్దు పోదు, పొద్దు-పొవట్లేదు: time doesn't pass-by; it's boring

జాము పొద్దు: In dictionary, its given as entire day; but ౙాము mean 3 hours ( its unclear to me ??)

పొద్దు తిరుగుడు పువ్వు: sun flower

పొద్దుౙూఁడు: moon


morning:

పొద్దు పొడిచే ముందు : just before sun-rise

తొలి పొద్దు: first sun-rays

పొద్దు పొడుపు: morning

పొద్దు పొడిచాక : after sun-rise, morning

అంబలి పొద్దు/అంబటి పొద్దు: breakfast-time; morning time to drink a dish called అంబలి (7AM - 10AM)

పొద్దున: In the morning


after-noon:

కరకర పొద్దు : A lot of time has passed since the sun rose.

(other usage) కరకర ఆకలి: excess hunger

పెద్దంబలి పొద్దు: afternoon; lunch time

నడి పొద్దు: mid day

ఎండపొద్దు: after-noon

లేఁబ్రొద్దు/లేంబ్రొద్దు/లేంప్రొద్దు: లేఁత + ప్రొద్దు; లేత ఎండ; early afternoon.

సన్న పొద్దు, సన్నియ పొద్దు: when sun rays are thin/soft (నీరెండ), after-noon,(around 3:00 PM)


evening:

అల పొద్దు: అల(మందం/కొంచెం) + పొద్దు

ఆల పొద్దు: A time when cattle(ఆల) returns after grazing.

ఆల-పొద్దు-చుక్క, కుందేటి-చుక్క: Planet Venus; Venus can be seen in evening/twilight.

అంగుడుపొద్దు

ఎడ పొద్దు

ఎర్ర పొద్దు, నెత్తురు పొద్దు: When sun is red in evening.

సందె పొద్దు: సంద్య పొద్దు

పొద్దుగ్రుంకు, పొద్దుగూకు, పొద్దుగూకి, ప్రొద్దుగ్రుంకి, పొద్దుమూకుట: సాయంకాలంవటం

గ్రుంకు: go down

ఎసళ్లుపొద్దు: ఎసరు* + -లు + -అ + (పొద్దు); A time when cooking starts in the late evening.

ఎసరు : వంటకై మరగకాచిన నీరు

పొద్దు ఎక్కుతున్నది : sun set

వాలు పొద్దు, పొద్దు వాలు: sun set, evening

మలిపొద్దు: evening



night

పొద్దు ఎక్కింది, పొద్దుపోయాక: after sun

కాందారి మాందారి పొద్దు, కానిదారి మానిదారి పొద్దు: mid night; roads, trees are not visible

ముచ్చిమి పొద్దు, ముచ్చు పొద్దు: time when robbers roam; night

సరిప్రొద్దు: mid-night

నిద్రపొద్దు

పొద్మీకి

పొద్దు మాపు: all day



references:

మాండలిక పదకోశం by అక్కిరాజు రమాపతిరావు

పదబంధ పారిజాతము

తెలుగు వ్యుత్పత్తి కోశం by లకంసాని చక్రధరరావు

త్రివేణి by బిరుదురాజు రామరాజు

https://andhrabharati.com/dictionary/

పొద్దు-నెల from నుడి-నానుడి

Note: some are dialectal words.

I will update this page, if I find any other usage of word పొద్దు

वेश्या

వేశ్య

తను శవమై

ఒకరికి వశమై


తనువు పుండై

ఒకరికి పండై


ఎప్పుడూ ఎడారియై

ఎందరికో ఒయాసిస్ అయి



Hindi Translation


वह शव बन के, 

किसी के आधीन हो के!


अपने तन को घायल करके, 

दूसरों के लिए अमृत पान बन के!


वह हर दिन रेगिस्तान बन के, 

कितनों के लिए ओएसिस हो के!


- written by Alishetty Prabhakar

- translated by telugufile


రావణ మండోదరి కథలు - 3 శివతాండవ స్తోత్రం

 









Wednesday, April 9, 2025

కవనాప్రసవం

 


ఈ లోకంలో నా కనుల వాకిట్లో 

జరిగే, జనుల ఇక్కట్లు అక్కట్లు కనికట్లు,

అవే నా భావావేశాలకు పోషక-ముట్లు


మదిలో స్మరించి, ఎదలో రమించి

భావాలు మదించి, ఆలోచనలు రంగరించి

పదాలు గుణించి, కాగితంపై లిఖించి

నా యువ నవ కవనాలని ప్రసవించినాను


****

చద్ది రాత

ధూర్తులు దేశాలని పాలీద్దురు

మూర్ఖులు ప్రజలని పీడిద్దురు


థ్రాష్టులు దేశాలని కొలువెట్టినారు

నికృష్టులు నిధుల్ కొల్లగొట్టినారు


భ్రష్టులు దేశాలని బంధించినారు

అపకృష్టులు స్వేచ్చని హరించినారు


గొర్రెలు కసాయిని నమ్మేరు

గాడిదలు ఓటే వేయరు


పందులు ఓటుని అమ్మేరు

బర్రెలు హక్కే కోరరు

బానిసలూ ప్రశ్నే అడగరు

అధములు గ్రూపులు కట్టేరు

పామరులు మాకేల అనుదురు


భారతి బోరున ఏడ్చె

వ్యర్ధులు నా బిడ్డలు అంతా అని


మనుషులు నన్ను తిట్టే

పశువులతో మము బోల్చితివి అని

పశువులు నన్ను తిట్టే

పాషాణాలతో మము బోల్చకు అని


ఇక నాలాంటి దద్దమ్మలు

ఇలాంటి పనికిరాని

పిచ్చి కూతలు కూసేరు

ఇక మీలాంటి చద్దెమ్మలు

ఇలాంటి చద్ది రాతలు చదివి

నన్ను తిట్లతో పొగిడేరు

లేక పొగడ్తలతో తిట్టేరు


కానీ మనలాంటి పౌరులు 

ఉన్నంత వరకు 

మన దేశము  

నిత్య అ(భి)వృద్ధి దేశమే   



****



చ్చెత్త రాత



నిజాం రజాకార్లు పాయే

ఖద్దరు ఖాకీలు అచ్చే


హుకుం జులుం పాయే

దాష్టీకం దౌర్జన్యం అచ్చే


దుష్పరిపాలన పాయే

దుర్మార్గపు పరిపాలన అచ్చే


అప్పటి ప్రజలు అన్యాయం కింద సచ్చే

ఇప్పటి ప్రజలు ఆధునిక బానిసత్వం కింద బ్రతుకు ఈడ్చే


స్వయంపరిపాలన అచ్చినా సుపరిపాలన ఇంకా రాలే అని

ఈ ఆధునిక తెలుంగువాఁడు దినం దినం మూగబోయి ఏడ్చే


***


రాజులు రాజ్యాలు పాయే,

మంత్రులు మండలాలు అచ్చే


రాజరిక వారసులు పాయే,

వారసత్వ రాజకీయం అచ్చే


శాసనాలు చాటింపులు పాయే,

జీ.ఓ.లు ఆర్డర్లు అచ్చే


దురాగతాల పాలన పాయే,

నేరపూరిత పరిపాలన అచ్చే


అప్పటి జనాలు మూర్ఖత్వం కింద సచ్చే,

ఇప్పటి జనాలు కుతంత్ర తంత్రాల కింద బ్రతుకు ఈడ్చే


ప్రజా పాలన అచ్చినా సుభిక్ష పాలన ఇంకా రాలే అని

ఈ భారతీయుడు క్షణం క్షణం ఆర్ద్ర పూరిత రౌద్రంతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచే


****

మాణిక్యం


చివరి పాదం చేరాలంటే
మొదటి అడుగు వెయ్యాల్సిందే
ఎక్కే నిచ్చెన మింగే పామును
దాటి ముందుకు పోవాల్సిందే!

మహా సంద్రం దాటాలంటే
హాయి తీరం వదలాల్సిందే
అలల హోరు గాలి జోరు
తట్టుకోని సాగిపోవాల్సిందే!

శిఖరాన్ని అధిరోహించాలంటే
రాళ్ల బాట పట్టాల్సిందే
అలుపు ఎరుగక ఎక్కాల్సిందే
జారిపోయినా లేచి మళ్లీ మొదలెట్టాల్సిందే!


మెరిసే మాణిక్యం అవ్వాలంటే
పుడమి భారం మోయాల్సిందే
అగ్ని కాష్టంలో రగలాల్సిందే
సమ్మెట పోట్లను చవి చూడాల్సిందే!

ఎందరిలో ఒకరవ్వాలంటే
నీ దారినీ నువ్వే వెయ్యాల్సిందే
వేసిన దారిపై ఉరకాల్సిందే
ఓడి-పడినా, లేచి మళ్లీ పరిగెత్తాల్సిందే!

ఉరికి ఉరికి గెలవాల్సిందే
గెలిచి గెలిచి మెరవాల్సిందే
మెరిసి మెరిసి చరిత్రలో నిలవాల్సిందే!



****


గెలుపు


తలరాతను మట్టున పెట్టి,

విధి బ్రహ్మను పక్కకు నెట్టి


కాలానికి కష్టం తోడై,

కష్టానికి సంకల్పం నాందై


గమనానికి స్వప్నం నీడై,

గగనానికి నిచ్చెన నీవై


గమ్యానికి మార్గం సిద్ధం,

ఇక గెలుపన్నది అనివార్యం అద్వితీయం


****

కోపగ్రస్తులు


నీదు కోపం నీకు నీవే శాపం

నీ తనువుకు నీవే హానికరం

నీ మనసుకు నీవే బాధాకరం

నీ బ్రతుకునకు నీవే సంకెళమయం


శాపగ్రస్తులు కైనా ఉండును శాపవిమోచనం 

కోపగ్రస్తులకు లేనే లేదు శాంత జీవన పయనం

వారి జీవనం నిత్య సజీవ ఖనన-అగ్ని దహనం 

శాంతగ్రస్తులకు నరక లోకమున విధించిన

                            నరుకు శిక్షలు అయినా 

వారికి అది పూల తోటలో 

                        పుష్పాల ఆటతో సమానం 


క్రోధమే గోచరించు నరుని జీవము దుర్భరం

శమమే గోచరించని జీవము దుఃఖ మయం

తన అస్తమయానికి తనే వేసుకుంటున్న ముళ్ల మార్గం

కోపము వీడి శాంతచిత్తుడు అయినా వాడికి ఇక

జయమే జయము

జయమే జయము


****

నాలోనే నాతోనే నా ప్రయాణం

  

ఒంటరితనమే నా ఊర్వశి

ఉన్మాదమే మా తొలి చూలు

ఈ పిచ్చి రాతలే మా ముచ్చట్లు

నిక్కచ్చి ఆలోచనలే మా అగచాట్లు

నాలోనే నాతోనే నా ప్రయాణం


రాత్రే పగలై 

పగలే రాత్రియై

రాత్రింబవళ్ళు నే రవినై

నాలోనే నాతోనే నా ప్రయాణం


కాలమే భావమై

భావమే తేజమై

కాల సరితమున నే సత్యాన్వేషణకై

నాలోనే నాతోనే నా ప్రయాణం


శూన్యమే అనంతమై 

అనంతమే అంతమై

ఆద్యంతమున నే లయనై

నాలోనే నాతోనే నా ప్రయాణం


త్రుటిలో ధృతినై

ధృతితో జగత్తునై

క్షణ క్షణమున యుగ యుగమున కవినే నేనై

నాలోనే నాతోనే నా ప్రయాణం


నాలోనే నాతోనే నా ప్రణుతం, ప్రణవం,

నాలోనే నాతోనే నా సుదూరపు ఏకాంతపు ప్రయాణం



****






అగ్ని కవనము



నా ఆస్యమ్ జ్వాలాబిలం,

నా శబ్దం విస్ఫోటనా బాణం,

నా రుధిరం జ్వాలా ధ్రవం,

నా నేత్రం నిత్య సత్యాన్వేషణం,

నా హృదయం ముక్కంటి డమరుకం

           అది పాడేను యుద్ధ గమకం,

నా కరములు లిఖించు అగ్ని కవనములు

   అవి దహించును నా అరిషడ్వర్గములు



****

కౌసుంభ ధర(SUN)



కౌసుంభ కాంతిధరా

నిశి సంహార తేజోధరా

సకల జీవ ఉత్తాపకరా

ప్రభాకరా నమో నమః


నీ తేజ రహితం మా భుమాత జీవ రహితం

నీ క్షీణ తేజం మా తల్లి మంచు మలయం

నీ వెచ్చని కిరణం మా నేలకు పచ్చని తోరణం

నీ చండ ప్రచండం మా బ్రతుకు భస్మీపటలం


వేల కొట్ల ఏళ్ల పయనం నీది,

తృటి ప్రాయ సమయం మాది,

నిశీధి లో ప్రతిబింబించే 

చల్లని వెన్నెల నీది,

అజ్ఞాన నిషాలో జీవించే 

అల్ప జీవం మాది


నీ చలువ ఆరు ఋతువులు 

ఏడు రోజులు మూడు పుటలు

షడ్రుచులతో ఆవహిస్తున్నాము,

ఈ భుమిని ఆరగిస్తున్నాము,

సర్వం కనుమరుగయ్యేందుకు

నిత్యం మార్గం సుగమం

చేసుకుంటున్నాము


****


రావణ మండోదరి కథలు - 6 అక్కరకు రాని అలంకారాలు

 

రావణ మండోదరి కథలు

రావణ మండోదరి కథలు - 5 నలభీమ పాకం

 

రావణ మండోదరి కథలు

రావణ మండోదరి కథలు - 4 పునః పునః పునః పునః విడుదల

 

రావణ మండోదరి కథలు

రావణ మండోదరి కథలు - 2 కోటిలో చాట్

 

రావణ మండోదరి కథలు

రావణ మండోదరి కథలు - 1 మండే సండే కష్టాలు

 

రావణ మండోదరి కథలు

Tuesday, April 8, 2025

ఆడ పోదాము రారో


ఆడ పోదాము రారో



శ్రీపాదరాయ కన్నడ కృతి "అడ పోగొన బారో" తెలుగు అనువాదం



kannada-version: https://www.youtube.com/watch?v=rcgVEtVv5yI


ఆడ పోదాము రారో...

రంగ కూడి యమునా తీరమునందు

చిన్నికోలు చెండు బొమ్మరి 

చిన్న చిన్న ఆటకళలు


జాహ్నవి నది తీరమునంట, జనకరాయుని కూతురికంట

జానకికే వివాహమంట, జాణ నిన్ను పిలిచేనంట

ఆడ పోదాము రారో...

రంగ కూడి యమునా తీరమునందు

చిన్నికోలు చెండు బొమ్మరి 

చిన్న చిన్న ఆటకళలు


కౌండిన్య నగరమునంట, భీష్మకరాయుని కూతురికంట

శిశుపాలుడు వలదు అంట, నీకు జాబు రాసెనంట

ఆడ పోదాము రారో...

రంగ కూడి యమునా తీరమునందు

చిన్నికోలు చెండు బొమ్మరి 

చిన్న చిన్న ఆటకళలు


కౌరవులు[చే] పాండవులు, పాచికలాడి ఓడేనంట

రాజ్యాముని వదిలేనంట, రంగవిట్టలా పిలిచేనంట -

ఆడ పోదాము రారో...

రంగ కూడి యమునా తీరమునందు

చిన్నికోలు చెండు బొమ్మరి 

చిన్న చిన్న ఆటకళలు

 

                                     *Translation by Teluguphile*


బొమ్మరి: బొమ్మరము, బొంగరము 

 జాహ్నవి: గంగా నది పేరు

చిన్న చిన్న ఆటకళలు /(or) రంగు రంగు ఆటకళలు

తంబుర మీటెదవ

తంబుర మీటెదవ



(పురందర దాస కన్నడ కృతి అనువాదం)


kannada-version:https://www.youtube.com/watch?v=Fa82VXRctYE


తంబుర మీటెదవ .….

తంబుర మీటెదవా భవాబ్ది దాటెదవ

తాళము కొట్టెదవ …..

తాళము కొట్టెదవ, సురలను చేరెదవ

తంబుర మీటెదవ భవాబ్ది దాటెదవ


గజ్జెలు కట్టెదవ …….

గజ్జెలు కట్టెదవ ఖల-హృదయం తొక్కెదవ

గానము పాడెదవ…...

గానము పాడెదవ హరి మూర్తి చుసెదవ...

తంబుర మీటెదవా భవాబ్ది దాటెదవ


విఠలుని చుసెదవ…

విఠలుని చుసెదవ.. పురంధర

విఠలుని చుసెదవ వైకుంఠంకే ఉరికెదవ...

విఠలుని చుసెదవ

విఠలుని చుసెదవ వైకుంఠంకే ఉరికెదవ

తంబుర మీటెదవా భవాబ్ది దాటెదవ

తాళము కొట్టెదవ, సురులను చేరెదవ

తంబుర మీటెదవా భవాబ్ది దాటెదవ


**Translation by Teluguphile**