అలివేణి, ఓ మృగనయని
సరసిజ గుణముల గోమిని
జనని, జన వర ప్రదాయిని
హరి మది వాణి, శ్రీవేణి
వాగ్దేవి, బ్రహ్మ వాక్ ప్రదాయిని
హంస గామిని, సత్య గాయిని
కచ్చపి వాదిని, ముఖనివాసిని
వాణీ, వాక్పతి మది నివాసిని
అర్థ హార భామిని, సుహాసిని
కాళీ మాలిని, ఓంకార కారిణి
శక్తి దాయిని, హిమగిరి వాసిని
కాల సంహర్తి కాల ఏలిని, కాత్యాయిని