Woken from slumber,
After decade of night.
Dear Life, I will pay you back
Twice over, in kind.
Hold your horses and reins tight,
As I am gonna break them tonight.
Woken from slumber,
After decade of night.
Dear Life, I will pay you back
Twice over, in kind.
Hold your horses and reins tight,
As I am gonna break them tonight.
Silence is my lullaby,
and darkness my light,
Loneliness is my muse
and madness our child,
Rage is my blood
and calmness my heart,
Thorns are my bed
and chaos my night.
----
Partially inspired by my own telugu writing నాలోనే నాతోనే నా ప్రయాణం
Original: music instrumental
Version 3
మళ్ళీ రావా? మళ్ళీ రావా?
మళ్ళీ రావా, నూ ఏ నాటికి
మల్లె పువ్వ, ముళ్ళ పువ్వ
మాయం చేసావే నా నన్నుని
నీ ద్యాసలో.. అనువంతా… నే లేనా
నా శ్వాసలో.. నిలువంతా…నువ్వేగా
గతించిన వరం నువ్వేలే
వరించిన గతం నువ్వేలే
ఆ రోజు లే
మళ్లీ రా..వు…లేగ
హరించిన సగం నువ్వేలే
దరించిన విషం నువ్వేలే
ఆ రోజు లో
నేను ఆ..గి… పోనే
గతించిన వరం నువ్వేలే
వరించిన గతం నువ్వేలే
ఆ రోజు లే
మళ్లీ రా..వు…లేగ
హరించిన సగం నువ్వేలే
దరించిన విషం నువ్వేలే
ఆ రోజు లో
నేను ఆ..గి… పోనే
వెన్నెల్ని అడిగా, రాత్రుల్ని అడిగా
కనిపించినాదా... కలిమే మరి
ఆ నింగిలోన, తారల్ని అడిగా
నీ సౌఖ్య క్షేమం... మంచే అని
వెన్నెల్ని అడిగా, రాత్రుల్ని అడిగా
కనిపించినాదా... కలిమే మరి
ఆ నింగిలోన, తారల్ని అడిగా
నీ సౌఖ్య క్షేమం... మంచే అని
ఆ... చంద మామ…
దోబూచి..లాడనే... నాతోటి
ఆ… నింగి.. నేల..
ఏరోజు... అవి.. కలువవని
గతించిన వరం నువ్వేలే
వరించిన గతం నువ్వేలే
నీకోసమే,
నిన్ను వీ..డి పోయా
హరించిన సగం నువ్వేలే
దరించిన విషం నువ్వేలే
నికోసమే,
నిన్ను ఓ..డి పోయా
గతించిన వరం నువ్వేలే
వరించిన గతం నువ్వేలే
నీకోసమే,
నిన్ను వీ..డి పోయా
హరించిన సగం నువ్వేలే
దరించిన విషం నువ్వేలే
నికోసమే,
నిన్ను ఓ..డి పోయా
—english lyrics—
Version 1
ప్రేమ నాలో, పొంగేనీవేళ
నూ వున్నా, లేకున్నా మరి
చెప్పాలంటే, నీ కంటే చాలా
ప్రేమించానే, నూ వెళ్లాకే మరి
నే... నిశినైతే
నూ రవివా... కావా
నే... చలినైతే
నూ సెగవా... కావా
చెలి, చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
ఏ చోట నూ..
ఆ చోట నే లేనా...
చెలి, చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
నా లోన నూ
నీ లోన నే లేనా...
చెలి చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
ఏ చోట నూ
ఆ చోట నే లేనా....
చెలి, చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
నా లోన నూ
నీ లోన నే లేనా...
ఏ తీపి తిన్నా, గుర్తొచ్చే నాకు,
నా బుగ్గ పై...నీ ముద్దే కదా
నువెక్కడున్నా, ఏం చేస్తుపున్నా
స్వప్నాలో నాకు...నీ ఊసే కదా
ఏ తీపి తిన్నా, గుర్తొచ్చే నాకు
నా బుగ్గ పై...నీ ముద్దే కదా
నువెక్కడున్నా, ఏం చేస్తు పున్నా
స్వప్నాలో నాకు... నీ ఊసే కదా
నూ... నా.. లోన
ని లోన.... లేనా...
నే... చలినైతే
నూ సెగవా... కావా
చెలి, చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
ఏ చోట నూ
నా ఎదలో నీ రూపేనా,
చెలి చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
నా లోన నూ
నీ లోన నే లేనా...
చెలి, చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
ఏ చోట నూ
నా ఎదలో నీ రూపేనా,
చెలి చెలి, చెలి, చెలివే
చెలి, చెలి, చెలి, చెలివే
నా లోన నూ
నీ లోన నే లేనా...
---------english lyrics---------
------------------
Version 2:
ప్రేమించానే, నిన్ను చాలా
నీ తోటి, నీ తోడగా
అమ్మ తోడు, తనకంటే చాలా
వలిచానే, నీ నీడగా
నే బాధ ను, నూ హాయి... వేనా
నే మంట ను, నూ గాలి... వేనా
సఖి, సఖి, సఖి, చెలివే
సఖి, సఖి, సఖి, చెలివే
నువ్వెక్కడ
నా ఎదలో లేవా,
సఖి సఖి, సఖి, చెలివే
సఖి, సఖి, సఖి, చెలివే
నీ వాడినే
నీ ఏదలో లేనా,
సఖి సఖి, సఖి, చెలివే
సఖి, సఖి, సఖి, చెలివే
నువ్వెక్కడ
నా ఎదలో లేవా,
సఖి సఖి, సఖి, చెలివే
సఖి, సఖి, సఖి, చెలివే
నీ వాడినే
నీ ఏదలో లేనా,
ఆ వేళ లోన, పువ్వుల్ని చూస్తే
గుర్తొచ్చే నాకు, నీ నవ్వే కదా
నేనెక్కడున్నా, ఏం చేస్తువున్నా
నాలోన ద్యాస, నీ ఊహే కదా
ఆ వేళ లోన, పువ్వుల్ని చూస్తే
గుర్తొచ్చే నాకు, నీ నవ్వే కదా
నేనెక్కడున్నా, ఏం చేస్తువున్నా
నాలోన ద్యాస, నీ ఊహే కదా
Version 4
మళ్లీ రావా ? మళ్లీ రావా?
తేనె గువ్వా నా గూటికి
తుల్లె పువ్వు ముళ్ళ పువ్వా
గాయం చేసావే నా గుండెకి
నీ ద్యాసలో.. అనువంతా… నే లేనా
నా శ్వాసలో.. గాలంతా…నువ్వేగా
చెలి చెలి చెలి చెలివే
గాలుల్ని అడిగా గువ్వల్ని అడిగా
కనిపించినాదా… కలిమే మరి
చంద్రుని చూస్తే, గుర్తొచ్చే నాకు,
నీ మోము లోన... నవ్వే కదా
నేనెక్కడున్నా, ఏం చేస్తుపున్నా
నాలోని అణువు...నువ్వే కదా
ఓ... ప్రియతమా…
దోబుచి..లాడవే.... నాతోటి...
ఓ… అహితమా…
సర్గ-1(ఉత్కళిక చంధస్సు)
అందలముని ఎక్కినావు
వందనాలు పొందినావు
అంత వాడు అయ్యినావు
వింత పుంత పట్టినావు
కొంత కూత మార్చినావు
ఎంత మాట నేర్చినావు
మంద నడత పోయినావు
ఉంది మోత్తము ఒడినావు
కింద జారిపోయినావు
ఎంత మారిపోయినావు
కుంగి నీవు పోయినావు
ఇంక లేచి అరచినావు
***
ఈ ఉత్కళిక లో చివరి రెండు పాదములలో షష్ఠీ విభక్తి లోపించినది
గమ్యమేమో దూరముండి
దరికి నూ రాలేవు అంటే,
దిక్కులన్నీ దిక్కుతోచక
మూగబోయి నక్కి ఉంటే,
గాలివాటపు ఓటమేమో
తను గెలిచెనంటు నవ్వుతుంటే,
భువనమంత నిన్ను చూసి
వెక్కిరిస్తూ పక్కనుండి చూస్తువుంటే
హోరు గాలి జోరు పెంచి
పోరు ఈల మోగిస్తువుంటే,
జాలువారే వాన బొట్టు
కంట నీరుని ముంచుతుంటే,
పుడమి తల్లి వడిన చేర్చి
వెన్ను తట్టి ధైర్యం నింపుతుంటే,
మిన్ను లోని నల్ల మబ్బు
“పైకి లేరా” అని ఉరుముతుంటే,
ఎర్ర గుండు మండి మండి
వంటి లోన వేడి పెంచుతుంటే
బగ్గుమని నిప్పు కణికలు
గుండె నిండా అంటుకుంటే,
నాడి లోని నెత్తురంతా
కెరటమల్లె ఉప్పొంగుతుంటే,
బండబారిన కండరాలలో
చైతన్యం సర్రు సర్రున పారుతుంటే,
ఆశ-కోరికలే పోషకాలుగ మారి
సొక్కి-సోలిన మేనులోన
స్ఫూర్తి-శక్తులు కూరుతుంటే,
పెళ్ళు పెళ్ళున మానసిక సంకెళ్లు
తెంచుకుంటూ గెంతుతుంటే,
ఎదురు వచ్చే ఈదురు గాలులు
చీల్చుకుంటు ఉరుకుతుంటే
గెలుపు దారిలో అడ్డు వచ్చే
బండ-రాళ్లు కొండ-లోయలు
కరుకు-నేలలు పొంగే-ఏరులు
ముళ్ల-బాటలు ఘోరాటవులు
కరిగి-కృంగి జరిగి-వంగి
త్రోవ చూపవ దండాలు పెట్టవ !
సాఫ్ట్వేర్ మేనేజర్లకు ఓ ప్రేమ లేక** - పేరడీ పాట
original song : ఆకులో ఆకునై
కోడులో బగ్గునై
మీటులో రోతనై
స్క్రమ్ములో స్కమ్మునై
కడుపాత రొచ్చునై
నీ టీము గుడిపిపోనా
ఎటులైన ఇచటనే ఆగిపోనా? x 2
గల గల నీ వీచు కేరీయరులో మచ్చనై
జల జల నీ పారు హైకులో బ్లాకునై
పగతోటి చిరకాలం తిరిగేటి తేలునై
నడువొంపు దించేటి పదునైన కత్తినై
నీ టీము గుడిపిపోనా
ఎటులైన ఇచటనే ఆగిపోనా?
బరువెక్కి, అల నీ తల నెక్కి మలమల్ల
చెడ గొట్టి, తలవంపు నీకంపు మెయిలునై
ఆకలా దాహమా
చింతలా వంతలా
నీ తలలో వెర్రినై
ఈ కంపెనీ తగలాడ
నీ టీము గుడిపిపోనా
ఎటులైన ఇచటనే ఆగిపోనా?
***
original-బోలో బోలో బోలో రాణి క్యా చాహియే
Waiter: బోలో బోలో బోలో బాయి క్యా చాహియే
అరె పూరి చాహియే యా పాయా చాహియే
Customer: నీ బాసా నాకు తెల్డం లేదు తెలుగు తెలిసితే సెప్పు
W: ఏ ఊరు మంది?
C: అచ్చంపల్లి, నీ ఊరు ఏది?
W: హైదరాబాదు, ఇక చూసుకో
అచ్చంపల్లి బుల్లోడా నీకేటి కావాలా
కేకు కావాలా స్విస్సు జూస్ కావాలా
స్వీటు పోటు హాటు బైట్టు పండు వెన్నెల్లో
తాయి కావాలా స్పైసి చైనీసు తేవాలా
C: హైదరాబాది వెయిటర్ సాబ్ నాకు బిర్యాని కావాలా
కేకు లేవో చైనీసు లేవో నాకు తెల్దంట
బిరియాని పట్టుకొచ్చెరో ఓ పట్టు పట్టాల
W: చల్ రే బాయి, చేరా బోణి, స్టార్ట్ చేయ్యి ఫలహారం
సూపు తాగి, పాపడాల్నీ బెండు తీసే యవ్వారం
C: పల్లె దాటి ఫస్ట్ టైము బైటికి ఒచ్చానురయ్యో
బజ్జి చాట్టు పిల్లగాని లోకమే తెలవదయ్యో
W: తెచ్చిన ప్లేటు చప్పున తింటే బిల్ పట్టుకొస్తా
టిప్పు లాగేస్తా ఎగ్జిట్ గేటు చూపిస్తా
C: గేటు చూపి నీట ముంచే మాటలు ఎందుకురో
W: అచ్చంపల్లి బుల్లోడా ఇంకేటి కావాలా
C: హైదరాబాది వెయిటర్ సాబ నాకు ఇంకో బిర్యాని కావాలా
Police:
అరె జానీ కోయి బుక్కడ్ కో ఆతే హువా దేఖా
నహి యహా తో కోయి నహి ఆయా
W: ఓ కిలాడీ ఆపు-దాడి ప్లేటు మారిస్తే బెస్టు
తిండిబూచి ఆపిచస్తే, పట్టు కొస్తా నీ బిల్లు
C: పెద్ద బిల్లు చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా ఆపు నీ జట్టు రట్టు
W: చూసాలే నీ కండలన్ని రౌడీ రంగయ్యో
అరె అరె నిన్ను తలదన్నే A1 కేడి నేనయ్యో
C: నీది నాది ఒకటే భాష చూడు బాబయ్యో
W: అచ్చంపల్లి బుల్లోడా ఇంకేమి విననయ్యో
C: హైదరాబాది వెయిటర్ సాబ, హు హుహు హుం
***
original song తాను నేను
తాను నేను ముళ్ళు వేలు
తాను నేను కురుపు సలుపు
తాను నేనూ పంది చేను
తానూ నేనూ వేరు వేరు
కసి తానైతే మసినే నేనూ
మరణం ప్రాణం తానూ నేను
ఎలుక పిల్లి, పెదవి చేదు....
తాను నేనూ గరళం గొంతు
వీధి నేను కుక్క తాను
దారం నేను తెంపే తాను
గుర్రం నేను పగ్గం తాను
కావ్యం నేను కషాయం తాను
నేను తాను రాగం రోగం
వేరైపోని రాహు గ్రహణం
నేను తాను రాగం రోగం
వేరైపోని రాహు గ్రహణం
తాను నేను ముళ్ళు వేలు
తాను నేను కురుపు సలుపు
తాను నేను బెత్తం గాయం
తాను నేను గాయం గేయం
తాను నేను ముళ్ళు వేలు
తాను నేను కురుపు సలుపు
తాను నేనూ పంది చేను
తానూ నేనూ వేరు వేరు
కసి తానైతే మసినే నేనూ
మరణం ప్రాణం తానూ నేను
ఎలుక పిల్లి, పెదవి చేదు....
తాను నేనూ గరళం గొంతు
గరళం గొంతు గరళం గొంతు
గరళం గొంతు గరళం గొంతు
***
original song వీణ వేణువైన సరిగమ విన్నావా
కోడి వేపుడైన చిటపట విన్నావా
ముక్క ఉడికిన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల, జివ్వురేగాల
జిహ్వ ఊగాల ఉయ్యాలలీవేళలో
||కోడి వేపుడైన||
చక్కగ మగ్గిన వేళ, ఆ వాసన తగిలిన వేళ
నా నోటిలో, నీ ఊసులే పలికే రాగమాల
ఆకలి రగిలిన వేళ, ఆ ముక్కను కొరికిన వేళ
నా తనువునా, అణువణువునా జరిగే రాసలీల
||కోడి వేపుడైన||
ఎదలో కోరిక ఎదుట, ఎదుటే నిలిచెను తునక
నీ రాకతో నా నోటిలో, కురిసే రసకేళిక
కదిలే కోరిక చిలక, అది నోట్లో కొస్తే గనక
నా పొట్టలో, నీ దినుసులే నడక నవ్య కళిక
||కోడి వేపుడైన||
***
[సురా] పానం
Original : సిరివెన్నెల - విధాత తలపున ప్రభవించినది
మధించి కడలిన, ప్రభవించినది, అనాది జీవన పానం, ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ సారం, ఓం ...
మధిర కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో, ప్రతిధ్వనించిన మధించి మదించి కాశ్యం ...
రససస్వర సుర ఝరీ గమనమౌ, సార పాన సారమిది ||2||
నే తాగిన జీవన పానం, ఈ పానం ..
మదించినై మతి-చించితిని ఈ కవనం, మధించినై మధిపించితిని ఈ మదిరం
ప్రాగ్దిశ సమయములోన సురభర మధూప కూజల సేవ,
జాగృత విహంగ పరులే వినీల గగనపు వేదిక త్రోవ ||2||
తొలికిన ఝరఝర రసముల సుర-గతి జగతికి శ్రీకారము కాగ,
విశ్వ కావ్యమునకిది భాష్యముగా..
మదించినై మతి-చించితిని ఈ కవనం, మధించినై మధిపించితిని ఈ పానం
జ్వలించు ప్రతి నర గళమున పారిన అమృత పాన తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2||
అనాది పానం ఆది సారమున అనంత జీవన వాహినిగ సాగిన శృష్టి విలాసమునే
మదించినై మతి-చించితిని ఈ కవనం, మధించినై మధిపించితిని ఈ పానం
***
వికీపీడియా మేరకు, హైదరాబాద్‌ను 1591లో కులీ కుతుబ్ షాహీ నెలకొల్పాడంటారు. కానీ ఇది మొత్తము వాకువ(కథ) కాదు
తెలంగాణకి జైనమత జరిమి(చరిత్ర*) ఉంది. 1000 C.E. కి ముందే, జైన కోబైలు (క్షేత్రం*) గా పేరు పొందింది.
మచ్చుకకు, kulpakji ను చూడండి — ఇది కుతుబ్ షాహీ సావి (కాలం*) ముందే ( కాకతీయులకన్నా ముందే) ఉన్న మొనారి(ప్రముఖ*) జైన బైలు (క్షేత్రం*). అలాగే, కరీంనగర్‌లో బొమ్మలగుట్ట దగ్గర గుర్తించిన జైన పరిదెల్పాలు (శాసనాలు*) మరియు తెలుగు అల్లులు (పద్యాలు*), 945 C.E. నాటివి. ఈ అల్లులు పంప పొహి(కవి*) తమ్ముడు రాయించాడు/చెక్కించాడు (పంప పొహి కన్నడంలో మహాభారతాన్ని నుడించిన (అనువదించిన*) మొనారి పొహి) ఇతడు సబ్బినాడుకు(కరీంనగర్*) చెందిన వాడు అని, తెలుగు వాడే అని కొందరి తెలుగు జరిమికారుల(చరిత్రకారులు*) వాటు(వాదన*).
తెలంగాణం శాతవాహనుల సావి నుంచి నిలువుమయమే (జనమయమే*). చెప్పాలంటే శాతవాహనులకంటే, ఇంకా చాలా ముందు నుంచి నిలువుమయమే. ఈ జైన కోబైలు గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాలి అంటారా ?
హైదరాబాద్ దగ్గరలోని చిలుకూరు వద్ద ఒకప్పుడు జైన మరం ఉండేది ; ఇది సుమారు 2000 ఏళ్ల నాటిది అని జరిమికారుల అంచనా. కాకపోతే దానీ కూలగొట్టి, అక్కడి రాళ్లను దగ్గరలో ఉన్న చెరువు కట్టడంలో వాడేశారు. ఆ రాళ్లలో ఒకదానిపై "janina basadi" ( may be “జనీన వసతి”) అనే పరిదెల్పం కూడా గుర్తించారు.
అదే సావి నాటి, హైదరాబాద్ దగ్గరలో రష్ట్రకూట ఠేవ(శైలి*)లో కట్టబడిన ఒక చిన్న కోవెల కూడా ఉంది ; ఇది సుమారు 1000 ఏళ్ల నాటిది.
తెలంగాణ జరమికారుడు సురవరం ప్రతాప్ రెడ్డి రాసినదాని మేరకు ; గోల్కొండ సల్తనేట్‌లో 7వ ఏలిక అయిన అబ్దుల్లా కుతుబ్ షాహి తన కోట (నేటి గోల్కొండ కోట) పునాది వెయ్యటం కోసం కొండయ్య అనే వ్యక్తి బాసట(సహాయం*) కోరాడు. కోట పునాది వెయ్యటానికి సంబంధించిన ఒప్పందం రాత రూపంలో, పర్షియన్ మరియు తెలుగు నుడిలలో రాయబడింది.
ఆ ఒప్పంద పొత్తాని సురవరం గారు వెతికి, కొండయ్య లెంబి(కుటుంబం*) వద్ద కనిపెట్టారు — దీనిపై గోల్కొండా తరాంకు(పత్రిక*)లో 1941లో ఆయన రాసిన విరివి-వ్రాలు(వ్యాసం) ను చదవవచ్చు:
గోల్కొండ కోట కూడా ఒక చిన్నపాటి పాత కాకతీయ కట్టడము పై కట్టబడి ఉండొచ్చు అన్న జాడలు ఉన్నాయి.
ఇప్పుడు హైదరాబాద్‌కి ఉన్న ఇతర పేర్ల గురించి:
భాగ్యనగర్/బాగ్‌నగర్ పేరు మీరు వినే ఉండొచ్చు — కొందరైతే దీనిని భాగమతి పేరు మీదనని అంటారు, మరికొందరైతే బాగ్ అంటే తోట అని, హైదరాబాద్ అనగా "సిటీ ఆఫ్ గార్డెన్స్" అంటారు .
అయితే ఇంకో పాత పేరు కూడా ఉంది — మానుగల్లు.
ఈ “మానుగల్లు” అనే పేరు కుతుబ్ షాహి రాసిన ఒప్పంద పొత్తములో కూడా కనిపిస్తుంది — ఇది "మాను" (చెట్టు) + "గల్లు" (రాళ్లు) అని అర్థం.
ఈ పేరు ఎలా వచ్చింది అనే దాని మీద నా ఆలోచన:
"ఇక్కడ ఏముంది **చెట్లు** **రాళ్లు** తప్ప" అని ఒక వాడకం ఉంది, దానిలో నుంచి **మానుగల్లు** పేరు వచ్చి ఉండొచ్చు కాబోలు
తెలంగాణలో చాలా ఊర్ల పేర్లలో "గల్లు" లేక "కొండ" ఉంటుంది:
* ఓరుగల్లు – ఏకశిలా నగరం (వరంగల్)
* మానుగల్లు / గొల్లకొండ
* పానగల్లు
* ఇనుగల్లు
* చలికల్లు
* రావికల్లు
* నాగరికల్లు/నకిరేకల్
* నల్లగొండ
* రాచకొండ
* దేవరకొండ
* హనుమకొండ