Saturday, May 17, 2025

వర్ణమాల

అనాదిగా మే 

వర్ణాలంటూ వర్ణములంతా

చెరో పథానా పోతామంటే,

శబ్దము తప్ప అర్థము ఉండదు 

అర్థము లేక వ్యర్థము పలుకును,

సందిగ్థం తప్ప సారం ఉండదు

సారము లేక భావము పలకదు


రవ్వ రవ్వ అర్ణవమవుతుంది

వర్ణం వర్ణం పదమవుతుంది

శబ్దం అర్థం ఒకటవుతుంది

భావం భాష్యం జన్మిస్తుంది,

వర్ణాలన్నీ వైరం వదిలి ఒకటైతేనే 

హరివిల్లుగా వెలుగవుతుంది

No comments:

Post a Comment