Friday, May 9, 2025

మందారపు సింధూరం

కాశ్మీరపు వాకిటలో సింధూరపు జల ధారలు మందారపు జన తారలు బంధూరపు పర్వత శ్రేణులు బందూకుల బందీ ఖానాలు

సింధూలను
హిందూలుగ ముసలిముగ
విభజించే సైంధవులు
అర్జించే భిక్షకులు
ఘాతకులు అటువైపు

పొలిమేరన పొలమారక
మతమెరుగక ఒకతీరుగ
గర్జించే రక్షకులు
నిర్జించే శిక్షకులు
సైనికులు ఇటువైపు

మ్రోగే సమర-మృదంగములు
పూచే విద్వేషములు, వీచే విధ్వంసములు
పేల్చే సాయకములు, చీల్చే చక్రములు
చచ్చే పామరులు పాతకులు సైనికులు

కాలేది కాష్ఠమో కొరికేది కంకోష్ఠమో
గెలిచేది మనమో మరణమో రణమున
ఓడేది వాడో మానవత్వమో సమరమున
మిగిలేది వరమో పరమో చివరన

***

No comments:

Post a Comment